టాలీవుడ్‌లో సుడిగాలి సుధీర్ అంటే అసూయ పెరిగిందా… ఏం జ‌రుగుతోంది…!

జబర్దస్త్ షో ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో కమెడియన్ లు పరిచయమయ్యారు. వారిలో ప్రధానంగా బుల్లితెర స్టైలిష్ స్టార్ గా పిలుచుకునే సుధీర్ కూడా ఒకరు. ఈయన క‌మెడియన్ గానే కాకుండా మరియు యాంకర్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సుధీర్ చేసే తన స్కిట్‌లు, డాన్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుధీర్‌ ఇప్పటివరకు హిరోగా రెండు సినిమాలు తీశారు. ఇక వాటిలో సాఫ్ట్‌వేర్ సుధీర్ ఒకటి రీసెంట్ గా రిలీజ్ అయిన గాలోడు. ఈ రెండు సినిమాల్లో కూడా సుధీర్ తన నటనతో ఆకట్టుకున్నాడు.Software Sudheer Movie Review and Rating - TeluguBulletin.com

తాజాగా విడుదలైన గాలోడు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. తొలి వారంలోనే ఈ సినిమా 1.5 కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సినిమా కన్నా ముందు విడుదలైన పలు హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రాలేదు. సుధీర్ తన రెండో సినిమాతోనే తన క్రేజ్‌ అమాంతంపెంచుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా నిర్మాతలు సరిగా చేయ‌లేదు.

Sudigali Sudheer Gaalodu Movie Review and Rating

సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం స్ట్రాంగానే ఉన్నాయి. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూసి సుధీర్ కి ఉన్న పాపులారిటీ చూసి కొందరు అసూయ పడుతున్నారు. ఈ సినిమాకి ఇంత బాగా ఓపెనింగ్స్ రావటానికి ప్రధాన కారణం సుధీర్ తన స్కిట్స్ లో మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేయటం. బ్రూస్ లీ సినిమాలోని స్టార్ స్టార్ మెగాస్టార్ అనే మ్యూజిక్ తో క‌ళ్ళ‌ద్దాల‌తో స్టైల్ గా సుధీర్ ఎంట్రీ ఇవ్వడం చాలామంది ప్రేక్షకులకు బాగా నచ్చింది.

గాలోడు టీజర్ రిలీజ్.. సుడిగాలి సుధీర్ మేకోవర్ మాములుగా లేదుగా

చిరంజీవితో పాటు పవన్ పై కూడా సుధీర్ ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ అంటే తనకి ఇష్టం అంటూ ఎప్పుడూ చెప్పడంతో మెగా అభిమానులలో సుధీర్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్ ఇప్పుడు తన సినిమాకి ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రావడానికి హెల్ప్ అయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Share post:

Latest