ప్యాంట్ మర్చిపోయావా? శ్రియా తాజా డ్రెస్ పై ప‌చ్చి కామెంట్స్‌!

శ్రియా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ఈ దంప‌తుల‌కు పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. అయితే త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని మీడియాకు తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది.

కూతురు సైతం పుట్టి ఏడాది త‌ర్వాతే అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. ఇక పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న ఈ అందాల భామ.. ఇటీవ‌ల తన అందాలతో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది.

ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా గ్లామర్ షో చేస్తూ కుర్ర‌కారు అల్లాడిస్తుంది. తాజాగా మరోసారి అందాలతో మిస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది. మోకాళ్ళకు పైకి ఉన్న గ్రీన్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి ఒంపు సొంపులు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజ‌న్లు మాత్రం ప్యాంట్ మర్చిపోయావా శ్రియా అంటూ పచ్చిగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం శ్రియా అందాలను పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.