ఎరుపు రంగు శారీలో ఇరగదీసిన శ్రియ… రొమాంటిక్ లుక్ అదిరింది!

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరన్ గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండరనే చెప్పుకోవాలి. దాదాపు ఓ రెండు దశాబ్దాలుగా అమ్మడు తెలుగు ప్రేక్షకులను తనదైన నటన, అందంతో రంజింపజేస్తోంది. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూనే మరోపక్క అదిరిపోయే లుక్కుతో సోషల్ మీడియాలో చిచ్చుపెడుతోంది. చీరకట్టులో శ్రియ అందం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. తాజగా ఎర్ర రంగు చీరలో రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతోంది ఈ అందాల రాశి. శ్రియ గ్లామర్‌ పిక్స్‌ చూస్తుంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్‌లా కనిపిస్తోంది.

టాలీవుడ్‌లో ‘ఇష్టం’ అనే సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్ తనదైన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో అనతికాలంలోనే సూపర్ స్టార్ రేంజ్ దక్కించుకుంది. స్టార్ హీరోలు మొదలుకొని కుర్ర హీరోల పక్కన జోడి కట్టిన శ్రియ ఆమధ్య పెళ్లి చేసుకొని ఏకంగా ఓ బిడ్డకు తల్లైన సంగతి తెలిసినదే. అయితే ఆ తర్వాత కూడా హీరోయిన్‌గానే బడా హీరోలతో జోడి కడుతోంది. తాజాగా హిందీలో దృశ్యం 2తో పలకరించింది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా శ్రియలో యాక్టింగ్ జోష్ తగ్గలేదని అర్ధం అవుతోంది. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్, లేటెస్ట్ డిజైనర్‌ వేర్‌తో ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

అదేవిధంగా మరో వైపు పర్సనల్‌ లైఫ్‌ని కూల్‌గా ఎంజాయ్‌ చేస్తూవుంది. యాక్టింగ్‌లోనే కాదు శ్రియ శరణ్‌ సోషల్ మీడియాలో కూడా మెల్లమెల్లగా తన క్రేజ్‌ పెంచుకుంటోంది. బిడ్డకు తల్లిగా మారినప్పటికి మాతృత్వంలోని మధురిమల్ని ఆస్వాదిస్తూనే తన అభిరుచిని వదలకుండా కొనసాగిస్తోంది. ఎప్పటి కపుడు తన అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా, బాలీవుడ్లో కూడా శ్రీయ తనదైన మార్క్ ని వేసుకుంది.

Share post:

Latest