ఆ సీనియర్ నటుడు ఫ్యామిలీ ప్రస్తుతం మరి ఎంత దారుణమా.. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు సాయం చేయలేదా..!!

అలనాటి నటులలో ఒకరైన కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన‌ పనిలేదు. 400కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తర్వాత అగ్ర నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం కటిక పేదరికంతో బాధపడుతున్నారు.. తమకు సాయం చేయాల్సిందిగా అందిస్తున్నారు.

Kanta Rao Death Anniversary: జానపద హీరో కత్తి కాంతారావు‌ను టాలీవుడ్  ఇండస్ట్రీలో అణగదొక్కారా.. అసలు నిజాలు ఇవే.. | Kanta Rao Death Anniversary  Do You Know Facts about Legendary ...

హైదరాబాద్‌లో నిన్న రవీంద్ర భారతి లో జరిగిన కాంతారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా పాల్గొన్న ఆయన కుమారులు అక్కడ వారు అనుభవిస్తున్న దీన స్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్ర పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం.. ఆస్తులు మొత్తం అమ్ముకొని మరీ సినిమాలు తీశారు.. దానివల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోయాం. నాన్న క్యాన్సర్ తో ఇబ్బంది పడినప్పుడు కూడా ఆయన చికిత్స కోసం ఎంతో డబ్బును ఖర్చు చేశాం.. ప్రస్తుతం ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం.

ఇక మా చిన్నతనంలో మద్రాస్ లో బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు సిటీకి దూరంగా ఎక్కడో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాము. చిత్ర ప‌రిశ్ర‌మ‌ నుండి మాకు ఎలాంటి సాయం అందలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే.. దయచేసి మాకు ఓ సొంత ఇల్లును కేటాయించి మాకు సాయం చేసీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము అని అక్కడికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కోరారు.

 

Share post:

Latest