ఏంటీ.. బ్రేక‌ప్ చెప్పింద‌న్న కోపంతో ఆ హీరోయిన్‌ను శ‌ర‌త్ కుమార్ బెదిరించాడా?

శరత్ కుమార్.. ఈయన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఉన్నప్పుడు ఈయన సినిమాలు అన్ని భాషల్లో విడుదలై మంచి సక్సెస్ను అందుకునేవి. హీరో గా నటించడానికి ముందు ఒక బాడీ బిల్డర్ గా ఆ తరువాత జర్నలిస్టుగా కూడా ఆయన పని చేశాడట. ఇక ప్రస్తుత కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని సినిమాలలో ఎక్కువగా విలన్ గా నటించాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ హీరోగా అవకాశాలు ఇచ్చింది.

అలా తమిల్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించి బిజీ స్టార్ అయ్యాడు. అంతేకాకుండా తమిళంలో రెండు నంది అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే శరత్ కుమార్ తమిళ్ సినిమాలు నటిస్తున్నప్పుడు హీరోయిన్ నగ్మా తో ప్రేమలో పడ్డాడు అని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే శరత్ కుమార్ కి ఛాయా అనే అమ్మాయితో పెళ్లి జరిగి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

కానీ నగ్మా తో కలిసి అనేక సినిమాలలో నటిస్తున్న సమయంలో ఆమెతో సీక్రెట్ రిలేషన్ షిప్ కొనసాగించాడట. ఈ విషయం తెలుసుకున్న శరత్ కుమార్ భార్య ఛాయా ఏకంగా డివోర్స్ దాకా వెళ్ళిందట. అప్పటికే శరత్ కుమార్ ఒకపక్క ఎంపీ హోదాలో మరోపక్క హీరోగా కెరీర్ కొనసాగిస్తున్న కూడా నగ్మాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. అయితే నగ్మా శరత్ కుమార్ అప్పటికే చాలా దగ్గరయి రహస్య బంధాన్ని కొనసాగించారు.

ఎప్పుడైతే శరత్ కుమార్ ఛాయా విడాకుల విషయం తెలిసిందో అప్పటినుంచి నగ్మా శరత్ కుమార్ ని దూరం పెట్టింది. తన కారణంగా వారిద్దరూ విడిపోతున్నారని భయంతో దూరం పెట్టిన నగ్మా.. ఆమె ఎడబాటును శరత్ కుమార్ తట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా తనకు బ్రేకప్ చెప్తే చంపేస్తా అంటూ నగ్మాను బెదిరించాడట. ఇక ఆ దెబ్బతో ఆమె సౌత్ నుంచి పారిపోయి బోజాపురి లో సెటిల్ అయింది. ఇక అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.

Share post:

Latest