స‌మంత క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదా… ఆమె పేరుతో ఇంత వ్యాపారం చేస్తున్నారా…!

స‌మంత వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఎంత భావోద్వేగానికి లోన‌యినా ఆమెపై అభిమానుల్లో క్రేజ్ మ‌రింత పెరుగుతోంది. చైతుతో విడాకులు త‌ర్వాత కూడా స‌మంత‌కు ఆఫ‌ర్ల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ఆమె తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. రొమాంటిక్ ఎంటర్టైన్‌మెంట్గా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా సునిశిత చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

Kushi First Look Motion Poster | Vijay Deverakonda | Samantha | Hesham  Abdul Wahab | Shiva Nirvana - YouTube

ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పై తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక హాట్ టాపిక్ న‌డుస్తోంది. ఖుషి సినిమాకు అన్నీ బాషల్లో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల రూపాయలకి పైగా అమ్ముడ‌య్యాయ‌ట‌. ఈ సినిమా క‌శ్మీర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన అంద‌మైన ప్రేమ‌క‌థ‌.

Kushi: Vijay Deverakonda, Samantha Tease Fans With The Title Track

రొమాంటిక్ డ్రామా కావ‌డంతో పాటు విజ‌య్‌, స‌మంత జోడీగా ఉండ‌డం హైలెట్‌. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా కూడా ఈ సినిమా రిజ‌ల్ట్‌పై ఎలాంటి ప్ర‌భావం అయితే చూప‌లేదు. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏదేమైనా స‌మంత పేరు చెప్పి ఓ రేంజ్‌లో బిజినెస్ చేస్తున్నార‌నే చెప్పాలి.

Share post:

Latest