`య‌శోద‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. స‌మంత బీభ‌త్స‌మే సృష్టించింది!

`యశోద`.. సమంత ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా ఇది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్రల‌ను పోషించారు.

నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాల కోసం ఎదురు చూసే వాళ్లకి యశోద బెస్ట్ ఆప్షన్. ఇందులో సమంత తనదైన పర్ఫామెన్స్ అద‌ర‌గొట్టేసింది. ఎమోషనల్ సీన్స్ లోనే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ విశేషంగా ఆకట్టుకుంది.

ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో తొలిరోజు సమంత బాక్సాఫీస్ వ‌ద్ద బీభత్సం సృష్టించింది. మొత్తం మీద 2 కోట్లు అనుకుంటే ఏకంగా 3 కోట్ల మార్క్‌ను దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.70 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 3.01 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా ఫస్ట్ డే య‌శోద వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..

నైజాం – 84 ల‌క్ష‌లు
సీడెడ్ – 18 ల‌క్ష‌లు
ఆంధ్రా – 68 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 1.70 కోట్లు(2.80కోట్లు~ గ్రాస్‌)
———————————-

తమిళం – 16 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 25 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌ – 90 ల‌క్ష‌లు
———————————–
టోటల్ వరల్డ్ వైడ్ – 3.01 కోట్లు(5.40కోట్లు~ గ్రాస్)
———————————–

కాగా, రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 8.99 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. అయితే లాంగ్ ర‌న్‌లో స‌మంత ఈ టార్గెట్‌ను సుల‌భంగా రీచ్ అవుతుంద‌ని అంటున్నారు.

Share post:

Latest