ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మయూసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కారణంగా సమంత ప్రమోషన్స్ లో భాగం కాకపోయినా.. టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలను అందుకోవడంలో యశోద సక్సెస్ అవ్వడంతో.. సమంత ఖాతాలో సూపర్ హిట్ వచ్చి పడింది. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` అని రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తుంది. అలాగే ఈమె నటించిన `శాకుంతలం` త్వరలోనే విడుదల కానుంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కు కూడా సమంత సైన్ చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు మరో సినిమాను లైన్లో పెట్టిందట.
ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇటీవల రాహుల్ ఓ స్టోరీ లైన్ వినిపించగా.. అది బాగా నచ్చి వెంటనే సినిమా చేయడానికి సమంత ఒప్పుకుందని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సమంత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే రాహుల్ నటుడిగానే కాదు దర్శకుడుగా కూడా ఫామ్ లో లేడు. అటువంటి వ్యక్తితో సినిమా చేసేందుకు ఒప్పుకుని రిస్క్ చేయడం అవసరమా సమంత అంటూ అభిమానులు సూచనలు చేస్తున్నారు.