బాహుబలి నెలకొల్పిన ఆ రికార్డులను బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్..

ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు జపాన్ దేశంలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అక్కడ మంచి టాక్ ఉండేది. ఆపై జపాన్‌లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ తెప్పించిన పెద్ద సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. బాహుబలి సినిమా జపాన్‌లో సూపర్ డూపర్ హిట్ భారీగా కలెక్షన్లు రాబట్టింది. మొదట రజినీకాంత్ నటించిన ‘ముత్తు ‘ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు నెలకొల్పింది.

బాహుబలి మూవీ ఫుల్ రన్‌లో 360 మిలియన్ యాన్ల కలెక్షన్లు వసూలు చేసింది. ‘ముత్తు’ సినిమా అప్పట్లోనే 400 మిలియన్ యాన్ల కలెక్షన్లు సంపాదించి రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డు నిన్నటిదాకా ఏ సినిమా బ్రేక్ చేయలేదు. కానీ తాజాగా రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆ రికార్డుల మీద కన్నేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి జపాన్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్లు గట్టిగానే ప్రచారం చేసారు. వివిధ రకాల పబ్లిసిటీ కూడా జరిగింది. అలానే ఈ సినిమాని ఒక రేంజ్‌లో రిలీజ్ చేశారు.

ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వారమే 75 మిలియన్ యాన్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచ్చింది. ఆ తరువాత మూడు వారలు కూడా సినిమా హైప్ ఏమి తగ్గలేదు. నాలుగవ వారం అయిపోయేసరికి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఏకంగా 250 మిలియన్ యాన్లు తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి సినిమా 250 మిలియన్ యాన్లు అందుకోవడానికి 36 వారాలు పట్టింది. అలాంటిది ట్రిపులార్‌ సినిమాకి కేవలం 4 వారాల్లోనే బాహుబలి కలెక్షన్లను కొల్లగొట్టింది. దానిబట్టి ఈ సినిమా జపాన్‌లో ఏ స్థాయిలో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిందో అర్ధమవుతుంది.

ఒకప్పుడు మన ఇండియన్ థియేటర్స్‌లో సినిమాలు 50 -100-175 రోజు ఆడేవి, కానీ ఇపుడు కేవలం రెండు మూడు వారాలు వుండి వెళ్ళిపోతాయి. జపాన్ లో అలా కాదు. ఇప్పటికి కూడా 100 రోజుల వరకూ థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమా రన్ థియేటర్స్‌లో ఇప్పుడే ఆగిపోదు. ఇంకో రెండు మూడు నెలల వరకూ ఆడే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా ముత్తు సినిమా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఖాయం అని అర్ధం అవుతుంది.

Share post:

Latest