ఫలితం ఎలావున్నా వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం… నెక్స్ట్ లిస్ట్ ఇదే!

కిరణ్ అబ్బవరం గురించి తెలియని తెలుగు యూత్ ఉందనే వుండరు. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అనతికాలంలోనే అందరివాడు అయిపోయాడు. అతని లుక్ చూస్తే ఎవరికయినా తన పక్కింటి వాడు గుర్తుకువస్తారు. అమ్మాయిలకు తమ తమ పాత బాయ్ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. కుర్రాళ్ళకైతే చెప్పనక్కర్లేదు… తమని తాము చూసుకుంటారు. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన నటనతో అతను మంచి మార్కులు వేయించుకున్నాడు. అలాగే ఆ తర్వాత 2021 లో వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్ సక్సెస్ అవ్వడంతో కిరణ్ తిరిగి వెనక్కి చూసుకోలేదు.

సెకండ్ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుని వరుస సినిమాలు రిలీజ్ అవ్వడానికి దోహదపడిందని చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సరం వచ్చిన ‘సెబాస్టియన్ పిసి 524’ అనే ప్రయోగాత్మక చిత్రంలో పెద్దగా ఆడకపోయినా క్రిటిక్స్ మెచ్చుకున్నారు. ఆ తరువాత సమ్మర్ లో రిలీజ్ అయిన ‘సమ్మతమే’ పర్వాలేదు అనిపించింది. కాగా గత సెప్టెంబర్ 16న విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్‌గా మిగిలి కిరణ్ ని కాస్త డైలమాలో పడేలా చేసింది.

అయితే ఇపుడు కిరణ్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు భోగట్టా. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల కిరణ్ ఒక ప్రముఖ కార్పొరేట్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు. దాంతో కొన్ని ప్రసిద్ధ బ్రాండ్‌లు అతనిని సంప్రదించాయి. అలాగే కిరణ్ త్వరలో మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏ ఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి బడా బ్యానర్‌లలో అతను సినిమాలు చేయబోతున్నాడు. ఇందులో ఒకటి రెండు హిట్ అయినా అతనికి స్టార్ స్టేటస్ దక్కుతుంది అని కిరణ్ అభిమానులు ఆశపడుతున్నారు.

Share post:

Latest