మెగా కుటుంబాన్ని నష్టాలలో మిగిల్చిన చిత్రం రీ రిలీజ్..?

మెగా బ్రదర్ నాగబాబు నటుడుగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మెగాస్టార్ కుటుంబం నుంచి రావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎన్నో చిత్రాలలో విజయవంతంగా నిలిచారు. నాగబాబు నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించడం జరిగింది.అందులో మెగా ఫ్యామిలీ తరఫున స్టార్ హీరోలకు అండగా ఉండి నాగబాబు ఎదగలేకపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Orange Full Movie Online In HD on Hotstar

నిర్మాతగా మారి అంజన ప్రొడక్షన్ బ్యానర్లో చిరంజీవితో ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. అలా తన అన్నయ్య చిరంజీవితో కలిసి రుద్రవీణ ,ముగ్గురు మొనగాళ్లు, త్రినేత్రుడు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అలా బావగారు బాగున్నారా చిత్రాన్ని తెరకెక్కించగా మంచి విజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రమైనప్పటికీ కలెక్షన్ల పరంగా బాగా రాబట్టి అప్పట్లో నాగబాబుకు లాభాలను తెచ్చిపెట్టాయి. అలా చిరంజీవితో నిర్మించిన సినిమాలు పెద్దగా కలిసి రాలేకపోవడంతో తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి ఆరంజ్ చిత్రాన్ని నిర్మించారు.

ఆరంజ్ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో నాగబాబు అప్పులలో ఒక్కసారిగా కురుకుపోవడం జరిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకోవడం వల్లే నాగబాబు ఆ అప్పుల నుంచి బయటికి పడ్డానని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఈ చిత్రం తర్వాత నాగబాబు మరే చిత్రాన్ని కూడా నిర్మాతగా వ్యవహరించలేదు. దీంతో నిర్మాతకు గుడ్ బై చెప్పి జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగి బాగానే సంపాదించారు.తన కుమారుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా ఎదగడంతో నాగబాబు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అయితే అంతటి పరాజయాన్ని చూసిన ఆరంజ్ సినిమా మ్యూజికల్ హిట్టుగా మాత్రం నిలిచింది.త్వరలోనే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో ని పోస్ట్ చేయడం జరిగింది. మరి నాగబాబును అప్పులపాలు చేసిన ఈ సినిమా రిలీజ్ చేస్తాననడంతో కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడెలా కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.