తమ్మినేని-ధర్మాన..రామ్మోహన్ ప్రత్యర్ధి ఎవరు?

శ్రీకాకుళం పార్లమెంట్‌లో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం తెలిసిందే..ఎంపీ రామ్మోహన్ నాయుడు తిరుగులేని బలంతో ఉన్నారు..గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే..అక్కడ రామ్మోహన్ బలం తగ్గించలేకపోయారు. పైగా పార్లమెంట్ పరిధిలో వైసీపీకి బలమైన నాయకుడు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రామ్మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి ఇంచార్జ్‌గా పంపించారు.

దీంతో శ్రీకాకుళం పార్లమెంట్‌లో వైసీపీకి నాయకుడు లేరు. అయితే ఈ సీటు రేసులో నిలబడే అభ్యర్ధుల విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బలంగా ఉన్న రామ్మోహన్‌కు చెక్ పెట్టాలంటే అంతే బలంగా ఉన్న నాయకుడు కావాలి. దువ్వాడ ఎలాగో టెక్కలికి వెళ్ళడంతో కిల్లి కృపారాణి ఉన్నారు..కానీ ఆమె ఆల్రెడీ ఒకసారి శ్రీకాకుళంలో గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

కాకపోతే లేడీ క్యాండిడేట్‌ని పెట్టే విషయంలో జగన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒక అనుభవం నాయకులని నిలబెట్టాలని చూస్తున్నారని  తెలిసింది. ఇదే క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాంని గాని, మంత్రి ధర్మాన ప్రసాదరావుని గాని..శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో పెడతారని తెలుస్తోంది. ఇక్కడ ధర్మాన ఫ్యామిలీ..కింజరాపు ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటుందనే టాక్ ఉంది..కాబట్టి ధర్మాన..రామ్మోహన్ పై పోటీ విషయంలో డౌట్ ఉంది. కాబట్టి తమ్మినేనిని దించితే..సామాజికంగా, ఆర్ధిక, అంగ బలం, అనుభవం కూడా ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారట.

అటు తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస సీటుని ఆయన వారసుడుకు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ సీటు కోసం సువ్వారి గాంధీ సైతం ట్రై చేస్తున్నారు.  ఈయన ఎప్పటినుంచో సీటు ఆశిస్తున్నారు. కానీ తమ్మినేనికి అనుభవం ఉండటంతో సీటు దక్కడం లేదు. ఇప్పుడు తమ్మినేనికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఇస్తే..ఆమదాలవలసలో తనకు లైన్ క్లియర్ అవుతుందని గాంధీ భావిస్తున్నారు. అటు జగన్ సైతం వారసులకు సీట్లు ఇవ్వడానికి రెడీగా లేరు. మరి చూడాలి ఈ సారి రామ్మోహన్‌పై ఎవరు పోటీ చేస్తారో చూడాలి.

Share post:

Latest