ర‌మాప్ర‌భ కూతురు ఆ స్టార్ హీరో భార్యే… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!

తెలుగు సీనియర్ నటి రమాప్రభ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. 70, 80 దశకంలో అగ్ర హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. అప్పట్లో ర‌మాప్ర‌భ – రాజ‌బాబు కాంబినేష‌న్ అంటే కెవ్వు కేకే. ఈమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమే త‌న‌ నటనతో తెలుగులోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ర‌మాప్రభ తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమాప్రభ తెలుగులో బిజీగా ఉన్న సమయంలోనే సీనియర్ హీరో శరత్ బాబును వివాహం చేసుకుంది. శ‌ర‌త్‌బాబు వ‌య‌స్సులో ర‌మాప్ర‌భ కంటే చాలా చిన్నోడు. వీరిద్దరూ 13 సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నారు.. కానీ తర్వాత కొన్ని అనుకోని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

రమాప్రభ ఆర్థిక ఇబ్బందుల్లో ఏమీ లేదు... మాజీ భార్యపై సంచలన ఆరోపణలు చేసిన  శరత్‌ బాబు - sarath babu sensational comments on ex wife ramaprabha -

రమాప్రభ తన సినిమా షూటింగ్‌లు జరిగే సమయంలో మాత్రమే బయటికి వచ్చేది. మిగిలిన టైంలో మదనపల్లిలో తన ఇంటిలోనే ఉండేది. తాజాగా రమాప్రభ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఈమె కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఇక ఆ ఇంటర్వ్యూలో రమాప్రభ నట కిరీటి రాజేంద్రప్రసాద్ తన అల్లుడనే విషయాన్ని బయట పెట్టింది.

రాజేంద్రప్రసాద్ నేను దత్తత తీసుకున్న నా అక్క కూతురు విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడని రమాప్రభ ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ విషయం రమాప్రభ చెప్పే వరకు ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ వల్ల నేను ఎన్నో అవమానాలకు గురయ్యానని కూడా రమాప్రభ ఆవేదనకు గురైంది.

Share post:

Latest