రామ్‌చ‌ర‌ణ్ కొత్త లుక్ వెన‌క ఇంత క‌థ ఉందా… !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తో ఉన్నాడు. త‌న తర్వాత సినిమాని కూడా సౌత్ ఇండియలో అగ్ర దర్శకుడైన శంకర్ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇక మధ్యలో ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ రాగా తర్వాత నూండి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. అక్కడ హీరో రామ్‌చరణ్ – హీరోయిన్ కియారా అద్వానీల పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీంతో సరదాగా కూర్చుని చిట్ చాట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫోటో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో రామ్ చరణ్ కు అలీమ్ సరికొత్త హెయిర్ స్టైల్ అందించాడు.

ఆ ఫోటోలో రామ్ చరణ్ లాంగ్ హెయిర్ లో బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని ఎంతో స్టైలిష్ గా ఉన్నాడు. తనకు ఇంత అందమైన హెయిర్ స్టైల్ ఇచ్చినందుకు అలీమ్ కు థాంక్స్ చెప్తూ ఆ ఫోటోలో చ‌ర‌ణ్‌ కనిపించాడు. బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. మ‌రి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ‌నుంది. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందు రానుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Share post:

Latest