గాడ్ ఫాదర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..!!

చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ సినిమా ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం దీపావళికి విడుదలై ఫస్ట్ వీకెండ్ మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత కాంతార చిత్రం రావడంతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ పడింది ఒక జాతీయ మీడియా తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పైన స్పందించడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

GodFather box office: Chiranjeevi's film grosses ₹38 cr worldwide on day 1 - Hindustan Times

రామ్ చరణ్ మాట్లాడుతూ మోహన్లాల్ లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని రీమేక్స్ చేసాము ఓటీటి లో ఈ చిత్రం భారీ ఆదరణ లభించిందని తెలిపారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రూ.145 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందని తెలియజేశారు. రీమిక్స్ సినిమాలు గురించి మాట్లాడుతూ లూసిఫర్ ఆధారంగా నిర్మించిన ఈ గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో బాగానే ఆకట్టుకుంది. కానీ మాతృభాషా ఆయన లూసిఫర్ సినిమా మాత్రం ఓటీటి లో ఇదివరకే విడుదలై బాగా ఆకట్టుకుంది. అందుచేతనే చాలా వరకు ప్రేక్షకులు గాడ్ ఫాదర్ సినిమాని చూడడానికి ఇష్టపడలేదని అదే గాడ్ ఫాదర్ సినిమా అని దెబ్బతీసిందని తెలిపారు.

GodFather: “గాడ్ ఫాదర్” లో సల్మాన్ చేసినందుకు ఆయన రుణం ఆ రకంగా తీర్చేసుకున్న రామ్ చరణ్..? | NewOrbit

ఒకవేళ రామ్ చరణ్ రీమిక్స్ సినిమాలు చేసే ఆలోచనలో ఉంటే మాతృక భాషని ఓటీటిలో విడుదల చేయవద్దని ఒరిజినల్గా నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తానని..అలా అయితే రీమిక్స్ చేస్తానని కండిషన్ పెడతాను.. ఒకవేళ అలా జరగనప్పుడు ఒరిజినల్ కథలు చేయడమే మంచిదని తెలిపారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో RC -15 సినిమాలో నటిస్తున్నాడమే కాకుండా తాజాగా RC -16 సినిమాను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ పైన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest