ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో `టిట్టు ఎంబీఏ` అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది. డేగ అనే ద్విభాష చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో ఈ బ్యాటీకి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం తదితర చిత్రాల్లో నటించింది. కానీ వీటిల్లో కంచె సినిమా మినహా మిగిలినవేవి ప్రగ్యాకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.
ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో ఈ భామకు `అఖండ` సినిమాలో అవకాశం వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ మూవీ డిసెంబర్లో విడుదలై భారీ విషయాన్ని అందుకుంది.
ఈ సినిమాతో ప్రగ్యా దశ తిరుగుతుందని అందరూ భావించారు. కానీ అలా ఏమీ జరగలేదు. అఖండ వంటి హిట్ పడిన ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం రావడం లేదు.
ఇక సినిమాలో సంగతి ఎలా ఉన్నా ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్గా ఉంటూ గ్లామర్ షో తో తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా మరోసారి తన అందాలతో నెట్టింట దుమారం రేపింది.
స్లీవ్ లెస్ లోనెక్ డ్రెస్ ధరించిన ప్రగ్యా.. సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి పిక్స్ చూసి పట్టపగలే ప్రగ్యా తన అందాలతో చుక్కలు చూపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.