వైర‌ల్ పిక్స్‌: క్యాజువల్ లుక్స్ లోనూ కిల్ చేస్తున్న `కంచె` బ్యూటీ..!

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ తగిన గుర్తింపు మాత్రం తక్క‌లేదు.

అయితే అన్నీ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఈ అమ్మడి కెరీర్‌ దాదాపు ఆఖరి ద‌శ‌కు చేరుకుంద‌ని అనుకున్నారు. అలాంటి తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెర‌కెక్కించిన `అఖండ` సినిమాలో అవకాశం దక్కింది.

ఈ సినిమాలో బాల‌య్యకు భార్యగా నటించి ప్రేక్షకులు మెప్పించింది. గది ఏడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ప్రగ్యా ద‌శ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ అఖండ విడుదలై ఏడాది కావొస్తున్న ప్రగ్యా జైస్వాల్ కు అవకాశాలు మాత్రం తక్క‌డం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

తాజాగా క్యాజువల్ లుక్స్ లోనూ కిల్ చేసే ప్రయత్నం చేసింది. వీకెండ్ లో భాగంగా ఓ రిసార్ట్‌కు వెళ్లిన ప్రగ్యా జైస్వాల్ నాజూకు నడుమును చూపిస్తూ కొంటెగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్ల‌ను ఆకట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రగ్యా తాజా పిక్స్‌పై మీరు ఓ లుకేసెయ్యండి.

Share post:

Latest