ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డ్‌..డార్లింగ్‌ను బీట్ చేసే మొన‌గాడే లేడు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు సినీ తారలపై సర్వే నిర్వహిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ మెయిల్ తెలుగు ఫిలిం స్టార్స్ ఎవరు..? అనే దానిపై ఓ సర్వే నిర్వహించింది.

అలాగే తాజాగా ఈ స‌ర్వేకు సంబంధించిన జాబితాను బయటకు వెల్లడించింది. అయితే ఈ లిస్టులో మోస్ట్‌ పాపులర్‌ టాలీవుడ్‌ స్టార్‌గా ప్రభాస్‌ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులు ఉన్నారు. అయితే జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. అంతేకాదు డార్లింగ్ ను బీట్ చేసే మొనగాడే లేడంటూ ఉబ్బిత‌బ్బి పోతున్నారు.

కాగా, ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. ఈయన ఓం రౌత్‌ దర్శకత్వంలో చేసిన `ఆదిపురుష్‌` వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ ప‌లుకారణాల వల్ల సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. అలాగే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ `సలార్` అనే మూవీ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` సినిమాను పట్టాలెక్కించాడు. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరియు మారుతితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని అంటున్నారు.

Share post:

Latest