అన్‌స్టాపబుల్ షోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పండగే!

ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో మొదలు పెట్టి రెండు మూడు వారాలు దాటిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్య బావ, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చి రాజకీయ జీవితం గురించి, యంగ్ ఏజ్‌లో ఆయన చేసిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కి అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలోనే రెండు, మూడు ఎపిసోడ్స్‌ కంప్లీట్ చేసేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లతో రెండో ఎపిసోడ్, శర్వానంద్, అడివి శేషుతో మూడో ఎపిసోడ్ చేశారు.

అయితే నవంబర్ 11న 4వ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ఎపిసోడ్ రాలేదు. ఈ ఎపిసోడ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య షోలో ఒక ఎపిసోడ్‌కి ఓ బడా స్టార్ రానున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ బడా స్టార్ మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా అన్నట్లు ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌కి విచ్చేసి దీన్ని గ్రాండ్ గా ముగించనున్నారట. పవన్‌, బాలయ్య బాలకృష్ణ ఒకే చోట కూర్చుని చక్కగా ముచ్చట్లు పెడితే ఈ షో ఎలా ఉంటుందో చూడాలని పవర్ స్టార్ అభిమానులు, బాలయ్య అభిమానులు ఎంతో ఆశ పడుతున్నారు. ఎందుకంటే బాలయ్య, పవన్ వేరు వేరు రాజకీయ పార్టీలలో ఉన్నారు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా చిత్ర రంగంలో కూడా వీరు ఉన్నారు. దాంతో వీరి మధ్య ఆసక్తికర జరగొచ్చు.

పవన్ కళ్యాణ్ ఇలాంటి సెలబ్రిటీ టాక్ షోలకి హాజరు కావడం చాలా తక్కువ. రాజకీయాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడమే కానీ పర్సనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనడంపై పవన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. అయితే రాకరాక బాలయ్య షోకే అతడు వస్తున్నాడనే వార్తలు వినిపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇంతవరకు బానే ఉంది కానీ అన్‌స్టాపబుల్ షోకి మధ్య మధ్య లో బ్రేక్స్‌ పడుతున్నాయి. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ షోకి ఇతర భాషా ప్రముఖలను కూడా ఆహ్వానించారు. కానీ వారికి డేట్స్ కుదరక రావడం లేదు. అందుకే బ్రేక్స్ అని తెలుస్తోంది.

Share post:

Latest