తన స్వార్థం కోసం కన్న కొడుకునే వాడుకున్న ఎన్టీఆర్.. నిజమేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన కొడుకుల్లో ముక్కుసూటిగా ఉంటూ ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పే గుణం కలిగిన ఏకైక వ్యక్తి హరికృష్ణ మాత్రమే.. చిన్న వయసులోనే తండ్రి తన సినిమాలలో తమ్ముడు బాలకృష్ణ తో కలిసి నటించినా కూడా హరికృష్ణ ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆయన హీరోగా సినిమాలను చేయలేదు . కానీ లేటు వయసులో సీతయ్య , లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా ఆయన గురించి.. ఆయన తండ్రికి చేసిన సేవలు గురించి సీనియర్ సినిమా జర్నలిస్టు ఇమంది రామారావు పూర్తి విషయాలను బయటపెట్టారు..Nandamuri Harikrishna's Journey in Films and Politics

ఇమంది రామారావు మాట్లాడుతూ.. హరికృష్ణ గారు ఒక మంచి ఆర్టిస్ట్.. అయినా సరే ఆయనను ఎన్టీఆర్ తనతోనే పెట్టుకున్నారు. ఆయన సొంతంగా సినిమా తీస్తున్నారు అంటే ఆ సినిమాకు సంబంధించిన అన్ని పనులను హరికృష్ణ చూసుకునేవారు. ఏదైనా కావాలని తండ్రి చెప్పారు అంటే వెంటనే హరికృష్ణ తెప్పించేవాడు. అంతేకాదు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత చైతన్య రథం పేరుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు. ఆ సమయంలో హరికృష్ణ తన సినిమా కెరియర్ ను వదులుకొని తండ్రి కోసం కష్టపడ్డారు. అలా తండ్రి కోసమే నటనకు దూరమయ్యారు హరికృష్ణ.

ఆయన ముక్కుసూటి తనం వల్ల బావ చంద్రబాబుతో గొడవలు పడి రాజకీయాలలో ఎక్కువ కాలం సాగలేకపోయారు. మరి లేటు వయసులో సినిమాలు తీసి హిట్ కొట్టారు . నటుడిగా ఆయన ఎంతో సాధించాలనుకున్నప్పటికీ తండ్రి కోరిక మేరకు తండ్రి దగ్గరే ఉండిపోయారు హరికృష్ణ. కానీ తన కోరికను తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తీర్చుకున్నారని ఇమంది రామారావు వెల్లడించారు. మరొక విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ జన్మించిన తర్వాతనే హరికృష్ణ గారు రెండో పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఎన్టీఆర్ కి తెలిసింది. అప్పటివరకు తెలియలేదు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు ఇమంధి రామారావు.