మృణాల్ మొండిత‌నం.. `సీతారామం` త‌ర్వాత అందుకే ఆఫ‌ర్లు రావ‌డం లేదా?

మృణాల్ ఠాకూర్.‌. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. దుల్క‌ర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది.

ఇందులో దుల్క‌ర్ సల్మాన్ ను ఆరాధించే సీతామహాలక్ష్మి గా మృణాల్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీతో ఆమెకు యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సీతారామం తర్వాత మృణాల్ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగడం లేదు. సీతారామం విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా మృణాల్‌ నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్మెంట్ కూడా రాలేదు.

అయితే ఇందుకు ఓ కారణం బలంగా వినిపిస్తోంది. సీతారామం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవడంతో మృణాల్ త‌న రెమ్యునరేష‌న్‌ను భారీగా పెంచేసిందట. రూ. 1.5 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని మొండిగా వ్యహరిస్తుందట. దాంతో దర్శక నిర్మాతలు ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారట. మృణాల్ మొండితనం వల్లే ఇప్పుడు ఆమెకు ఆఫర్లు రావడంలేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest