ఆ డైరెక్ట‌ర్ చూడ‌గానే ముఖం క‌డుక్కోమ‌న్నాడు.. నిధి ఓపెన్ కామెంట్స్‌!

తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్న అందాల భామ నిధి అగర్వాల్‌.. తాజాగా `కలగ తలైవన్` అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 18న థియేటర్స్ లో విడుదలయింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే ఈ సినిమా ఆడిషన్ సమయంలో తనకు ఏదైనా ఓ అనూహ్యమైన సంఘ‌ట‌న‌ను పంచుకుంది. నిధి మాట్లాడుతూ..`ఒక రోజు మగిళ్‌ తిరుమేణి నుంచి ఫోన్ వచ్చింది. ఒక సినిమా గురించి మాట్లాడాలని చెప్పగా నేను ఆయ‌న్ను క‌లిశాను. అప్పుడు నన్ను చూసిన వెంటనే ఆయన ముఖాన్ని కడుక్కో అని చెప్పారు.

ఆ మాటకు నేను షాక్ అయిపోయా. ఎందుకలా అన్నారో అర్థం కాలేదు. అయితే ముఖం శుభ్రం చేసుకుని వచ్చాక‌.. ఆయన నా ముఖం కవళికలను మాత్రమే ఫోటోషూట్ చేశారు. అలాగే ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించాలని తెలిపారు. ఇప్పుడు ముఖం ఎందుకు కడుక్కోమన్నారో అర్థమైంది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిధి కామెంట్స్‌ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి.

Share post:

Latest