చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జ‌క్క‌న్న‌.. నెటిజ‌న్లు మండిపాటు!

`ఆర్ఆర్ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. సీనియర్ నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే తాజాగా రాజమౌళి `హిట్‌ 2` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్‌ గా విచ్చేశారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..`నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉండనుంది. నేను ఎప్పుడు నుంచో ఓ అడ్వెంచర్ చిత్రం చేయాలి అనుకుంటున్నా. అందుకు సరైన సమయం ఇప్పుడు దొరికింది. ఈ సినిమాకి మహేష్ పర్ఫెక్ట్ గా స‌రిపోతాడు. ఈ చిత్రం గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాజ‌మౌళిపై నెటిజ‌న్లు మండిపోతున్నారు. ఎందుకంటే, ఈ విష‌యాల‌న్నీ గ‌తంలోనే ఆయ‌న చెప్పారు. దీంతో చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జ‌క్క‌న్న‌.. మ‌హేష్ మూవీపై కొత్త అప్డేట్స్ ఏమీ ఇవ్వ‌వా అంటూ నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు.

Share post:

Latest