ప్రభాస్ ను అతి దారుణంగా అవమానించిన నెట్ ఫ్లిక్స్..కారణం.?

టాలీవుడ్ స్టార్ హీరో నుంచి ప్రస్తుతం నేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చోట అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఏ సినిమాలో నటించినా సరే ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. ఉదాహరణకు ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హిందీలో ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ అవ్వడం ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచడం కూడా జరిగిపోయింది.

Clip From Prabhas' Saaho Is Making The Entire World Cringe

ఈ సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలు కొంతమంది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ ఇండోనేషియా.. సాహో సినిమాలోని ప్రభాస్ వీడియోను పోస్ట్ చేసి ఇదే యాక్షన్ ? అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ఇది చూసిన ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ఫ్లిక్స్ ప్రభాస్ ను ఇంత దారుణంగా అవమానించడం సరికాదు అని కామెంట్ల వర్షం కూడా వెలువడుతోంది . కొంతమంది నెటిజెన్స్ నెట్ ఫ్లిక్స్ ను అన్ సబ్స్క్రయిబ్ చేస్తామంటూ చెబుతుండగా మరి కొంతమంది కాదు నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Angry Prabhas Fans Delete Netflix Accounts After 'Saaho' Scene Gets Widely  Trolledప్రభాస్ అభిమానులు మాత్రం నెట్ ఫ్లిక్స్ తీరుపై మండిపడుతూ ఉండడం గమనార్హం. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ బాగా పెరుగుతుండడంతో తట్టుకోలేక ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ను టార్గెట్ చేస్తోంది అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. కానీ ప్రభాస్ ను టార్గెట్ చేయడం వల్ల వారికి ఏం ఒరుగుతుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Share post:

Latest