అవి చూస్తే టెంప్ట్ అయిపోతా..అసలు కంట్రోల్ చేసుకోలేను..రష్మిక లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పేరుని ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవిధంగా చేసుకోవడం అమ్మడు. కు వెన్నతో పెట్టిన విద్య కాగా కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్గా తన నటనను జనాలకు రుచి చూపించింది . మొదటి సినిమాతోనే మంచి నటి అని గుర్తింపు సంపాదించుకున్న రష్మిక .. ఆ తర్వాత హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా హ్యూజ్ ఫ్యాన్ బేస్ తో నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది .

అంతేకాదు గతేఅడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో సంపాదించుకొని.. ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చలామణి అవుతుంది . అంతేకాదు బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలు తన చేతుల్లో పెట్టుకొని టాప్ హీరోయిన్ అనిపించుకుంటుంది . తెలుగులో అమ్మడు రెండు సినిమాలు చేస్తుంది . కోలీవుడ్ లోను రెండు సినిమాలు చేస్తుంది. అంతేకాకుండా పలు ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టింది. కాగా రష్మిక మందన్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది.

రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక మందన్నా.. తన ఫేవరెట్ ఫూడ్ గురించి అభిమానులకు చెప్పుకొచ్చింది, ” నేను డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను ..వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ ఉంటాను ..అయితే నా కంటికి సుషి, సూప్ న్యూడిల్స్ వంటి ఆహార పదార్థాలు కనిపిస్తే మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేను. నా నోరుని నేను కట్టేసుకోలేను ..ఎలా అయినా సరే వాటిని ఓ పట్టు పడతాను ..అదేవిధంగా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అంటే పడి చచ్చిపోతాను ..ఎంత డైట్ లో ఉన్న కచ్చితంగా అవి నా కంటికి కనిపిస్తే తినేస్తాను.. ఇక తర్వాత పక్క రోజు ఫుల్ వాటర్ డైట్ తో క్యాలరీస్ ను బర్న్ చేస్తాను ..ఎక్కువగా రన్నింగ్ పై దృష్టి పెడతాను అంటూ చెప్పుకొచ్చింది . దీంతో రష్మిక ఇంత మంచి ఫూడీనా అంటూ జనాలు ఆమె ఇష్టాలు గురించి చెప్పుకొస్తున్నారు.

Share post:

Latest