ఆ విషయంలో మహేశ్ కంటే నాని నే బెటర్.. అడ్డంగా ఇరుక్కుపోయిన అడవి శేష్..!?

సినీ ఇండస్ట్రీలో అడవిశేష్ అన్న పేరుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరో కానప్పటికీ తీసిన ప్రతి సినిమాను మినిమం గ్యారంటీ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిల్చో పెడుతూ స్టార్ హీరోలకు ఏం మాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు అడవి శేష్ కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే . ఆ హ్యాండ్సం లుక్స్ కు ..ఆ స్కిన్ టోన్ కు.. ఎలాంటి ముద్దుగుమ్మ అయినా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఈ క్రమంలోనే ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలతో డేటింగ్ లో ఉన్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అవేమి నిజం కాదని కొట్టి పడేసాడు అడవి శేష్. కాగా రీసెంట్ గానే మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్.. మరోసారి అలాంటి హిట్ ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు . హిట్ 2 సినిమా తో అడవి శేష్ మరో బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటూ ..ప్రమోషన్స్ కూడా చక్కగా చేయడానికి సిద్ధపడుతున్నాడు . కాగా మహేష్ నటించిన మేజర్ సినిమాను దర్శకుడిగా ఉన్నింది టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత.

ఈ సినిమా కోసం ఆయన పరిమితంగానే పారితోషకం తీసుకున్నారట. అయితే హిట్2 సినిమాకు వచ్చేసరికి అడవి శేష్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతే కాదు కెరియర్ లోనే ఫస్ట్ టైం అడవి శేష్ ఇంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సినీవర్గాలు చెప్పుకొస్తున్నాయి . ఈ క్రమంలోనే ఈ సినిమాపై హ్యూజ్ హోప్స్ పెట్టుకోనున్నారు అభిమానులు . అంతేకాదు వరుసగా విజయాలను అందుకుంటున్న అడవి శేష్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన తప్పేం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ క్రమంలోనే మహేష్ బాబు కన్నా నాచురల్ స్టార్ నాని బెటర్ ..అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . హిట్టు2 నాని, తన సిస్టర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అడవిశేష్ ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉండడంతో ..నాని , అడవి శేష్ అడిగిన అంత రెమ్యూనరేషన్ ఇచ్చాడు అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి హిట్ 2 కి అడవి శేష్ కి ఎలాంటి హిట్టిస్తుందో..?

 

Share post:

Latest