దిల్ రాజు పై మండిపడుతున్న మెగా.. నందమూరి అభిమానులు.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. తాజాగా దిల్ రాజు పై మెగా అభిమానులు అటు నందమూరి అభిమానులు మండిపడుతున్నారని వార్త వైరల్ గా మారుతోంది. అది కూడా కేవలం ఒక సినిమా కోసమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Dil Raju Balakrishna Chiranjeevi: దిల్ రాజుపై మండిపడుతున్న మెగా, నందమూరి  అభిమానులు.. కారణం ఏంటంటే - chiranjeevi and balakrishna fans fires on dil  raju over he is booking majority theatres in ap and ...

డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాలో రవితేజ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఇదే సంస్థ నుంచి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా తలకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు మధ్యలో దళపతి విజయ్ తో కలిసి తెరకెక్కిస్తున్న వారసుడు సినిమాని దిల్ రాజు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

దిల్ రాజు నాలుగేళ్ళ క్రితం లాజిక్ ఇప్పుడు చిక్కుల్లో పడేసింది | Manacinemaవారసుడు సినిమాని డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అయితే ఇది వాస్తవానికి తమిళ సినిమా ఆయన తమిళంలో వారిసు అనే పేరుతో నిర్మించారు.వారసుడు సినిమా కోసం దిల్ రాజు ఆంధ్ర, నైజాంలో ఎక్కువ థియేటర్లను తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ విషయంపై చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు స్పందిస్తూ దిల్ రాజు పై ఫైర్ అవుతున్నట్లుగా సమాచారం. తమిళ హీరో కోసం తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు అడ్డుపడుతావా అంటూ కోప్పడుతున్నారట. కేవలం వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ. 9 కోట్ల కోసం మన తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ కు అడ్డుపడతావా అంటూ నెటిజన్లు ఆగ్రహం చెందుతున్నట్లు సమాచారం. మరి ఈ విషయాలపై బాలయ్య చిరు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest