మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. బాస్ పార్టీ వచ్చేది అప్పుడే..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కథానాయకుడుగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పక్కా మాస్ కంటెంట్తో తెరకెక్కిస్తున్నారు. ఇక డైరెక్టర్ బాబి కూడా చిరంజీవిని ఎంతో అభిమానించే అభిమానుల్లో ఒకరు కావడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Waltair Veerayya 1st song BossParty Song : వాల్తేరు వీరయ్య నుండి ఫస్ట్  సింగిల్... క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్! - OK Telugu

ఈ చిత్రంలో చిరంజీవి చాలా స్టైలిష్ లుక్ లో ఉండడమే కాకుండా యంగ్ గా కనిపిస్తూ ఒక మాస్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఇందులో చిరంజీవి ఒక మాస్ లుక్కులో మరొకసారి దర్శనమిచ్చారు. ముఖ్యంగా మల్టీకలర్ లుంగీలో ఆ లుంగీ పై లోపల టీషర్ట్ ఆపైన మెరుపుల చొక్కా చూస్తే ఈ సినిమా ముఠామేస్త్రి సినిమాను తలపించేలా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పక్కా మాస్ క్యారెక్టర్ తగ్గట్టుగా ఉన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.

ఇక చిరంజీవి ఇలాంటి లుక్ లో చూసి ఎన్నో సంవత్సరాలవుతోందని దీంతో కం బ్యాక్ ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నామని అభిమానుల సైతం భావిస్తున్నారు. మొదట లిరికల్ సాంగుని బాస్ పార్టీతో మొదలు పెట్టబోతున్నారు. ఈనెల 23వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాటని రిలీజ్ చేయబోతున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ని విడుదల చేశారు ఈ పాటలో ఊర్వశీ రౌతెలా నటిస్తున్నది.

Share post:

Latest