ఇంట్రెస్టింగ్: సిక్స్ ప్యాక్ లో మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ssmb 28 దీనిపైన అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దాదాపు 12 సంవత్సరాలు తర్వాత సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు రెండు షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ అంతా సిద్ధంగా ఉంది.

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం మహేష్ తన మేకోవర్ లో చాలా వరకు మార్పులు చేశాడు. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లో మహేష్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు దీనికి అనుగుణంగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ కష్టపడుతున్న మ‌హ‌ష్ ఫోటోని ఆయన భార్య నమ్రత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. రోజురోజుకు ఎంతో యంగ్ గా మారిపోతున్న సూపర్ స్టార్ మహేష్ తరచు క్రమం తప్పకుండా చక్కని డైట్ అలాగే ఎక్ససైజ్- వ్యాయామం చేస్తూతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Share post:

Latest