`ఎన్టీఆర్ 30`పై లేటెస్ట్ బ‌జ్‌.. ఈ ఏడాది లేన‌ట్టే అట‌!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ‌ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించ‌నున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను గ‌త ఏడాది స‌మ్మ‌ర్ లోనే అనౌన్స్ చేశారు. `ఆర్ఆర్ఆర్` విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఆర్ఆర్ఆర్ విడుద‌లై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా.. ఎన్టీఆర్ 30 షూటింగ్ స్టార్ట్ కాలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఈ మూవీ షూటింగ్ పై ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి.

కానీ లేటెస్ట్ బ‌జ్ ప్రకారం.. ఎన్టీఆర్ 30 షూటింగ్ ఈ ఏడాది లేనట్టే అని అంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ కావడం వల్ల కొరటాల క‌థ మరియు స్క్రిప్ పై కసరత్తులు చేస్తూనే ఉన్నారట. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చిత్రీకరణను ప్రారంభించాలని నిర్ణయించుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, ఈ చిత్రానికి `దేవర` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Latest