అనుష్కని ఆంటీ అంటున్న హీరో… చెప్పుతీసికొడతానంటున్నారు!

టాలీవుడ్లో అనుష్క స్టార్ డం ఏపాటిదో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తనదైన నటనతో అనుష్క స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం అని తేడా లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఘనత అనుష్క సొంతం. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. ఈ క్రమంలోనే ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి బ్లాక్ బస్టర్స్ లలో నటించి మెప్పించింది. ‘బాహుబలి’తో ఏకంగా ప్యాన్ ఇండియా యాక్ట్రెస్ గా పాపులారిటీ తెచ్చుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కాస్త గ్యాప్ తరువాత అనుష్క.. మళ్లీ సినిమాలు ఒప్పుకోవడం మొదలుపెట్టింది. అయితే తన వయస్సుకు తగ్గ పాత్రలే ఒప్పుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. యూవీ క్రియేషన్స్ లో అనుష్క ప్రధాన పాత్రలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంక నిర్మాణ దశలోనే ఉంది. మహేష్.పి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కాగా అనుష్కకు 48వ చిత్రమిది. ‘మిర్చి’, ‘భాగమతి’ విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి.

ఇక ఈ సినిమాలోని నటిస్తున్న హీరో యొక్క పాత్ర ఆంటీ అని సంబోధిస్తుందట. ఈ సందర్భంగా.. చిత్రటీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అనుష్కకు బర్త్ డే విషెష్ తెలిపింది. పోస్టర్ లో అనుష్క చెఫ్ గెటప్ లో వంట చేస్తూ కనిపించడం కొసమెరుపు. ఇక సినిమాలో ఆమె అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో అనుష్క కు పెళ్లి అంటే ఇష్టం ఉండదని, అందుకే అలా ఉండిపోతుందని, కానీ ఆమెను ఇష్టపడ్డ నవీన్ పోలిశెట్టి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూంటాడని చెప్తున్నారు.

Share post:

Latest