మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `1-నేనొక్కడినే` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అందాల భామ కృతి సనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
అయితే తెలుగులో తొలి సినిమాతోనే తీవ్ర నిరాశ చెందిన కృతి సనన్.. బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ తనదైన టాలెంట్ తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది.
ఇక చాలాకాలం తర్వాత ఈ అమ్మడు `ఆదిపురుష్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రంలో పాటు బాలీవుడ్లో మరికొన్ని ప్రాజెక్ట్స్ లో కృతి భాగమైంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ ఫోటో షూట్లతో కుర్రకారు నిద్ర పట్టకుండా చేస్తుంది.
అయితే తాజాగా ఈ బ్యూటీ చూపించడంలో మరింత తెగించేసింది. చాలీచాలని బ్లూ కలర్ డిఫరెంట్ డ్రెస్ లో అందాలన్నీ బయట పెట్టేసింది. కృతి సనన్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన కొందరు నెటిజన్లు ఆ డ్రెస్ ఏంటి? నీ పోజులేంటి..? అంటూ కృతి సనన్‌పై మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం కృతి అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.