చీరకట్టు అందాలతో మతిపోగోడుతున్న ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్‌..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఏ హీరోయిన్నైనా మన సౌత్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కి వచ్చిన పాన్ ఇండియా లెవెల్‌ ఇమేజ్ అనేది అతని పక్కన నటించే హీరోయిన్‌లకు కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చి పెడుతుంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్, ప్రాజెక్ట్ కెలో దీపిక, దిషా పటానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా సలార్ మూవీలో శృతి హాసన్‌తో నటిస్తున్న ప్రభాస్, సందీప్ వంగా స్పిరిట్ మూవీలో కరీనా కపూర్ తో కలిసి నటించే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ప్రభాస్, కృతి సనన్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని టాక్ నడుస్తుంది.

తాజాగా మనీష్ మల్హోత్రా డిజైనర్ శారీలో కృతి సనన్ తన అందాలను ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కృతి సనన్ టాలీవుడ్‌లో మహేష్ బాబుతో కలిసి 1 నేనొక్కడినే, నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలలో కృతికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చింది.

 

కృతి ఫొటో లేదా వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే నెటిజన్లు షేర్స్, లైక్స్‌తో హడావుడి చేస్తుంటారు. కాగా తాజాగా కృతి సనన్ బ్లూ కలర్ శారీలో అందరికి కేక పుట్టించే పోజులతో ఆకట్టుకుంటోంది. అలానే అందమైన ఫల్గుణి షేన్ పీకాక్ శారీలో ఈ నటి ట్రెడిషనల్ గా కనిపించింది. స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌ ధరించి బోల్డ్ లుక్‌లో మెరిసిపోయింది. ఆకర్షణమైన చెవిపోగులు, లిటిల్ గ్లామ్ మేకప్‌తో ఆమె తన బ్యూటీని మరింత రెట్టింపు చేసుకుంది. ఈ భామ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.

Share post:

Latest