మోకాళ్లపై కూర్చుని ప్ర‌భాస్ ప్రపోజల్‌.. ఫైన‌ల్‌గా నిజం ఒప్పుకున్న కృతి స‌న‌న్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, ఆయన్ను అభిమానిస్తున్నారని, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే అని కృతి పలు సందర్భాల్లో చెప్పింది.

దీనికి తోడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ `భేదియా(తెలుగులో తోడేలు)` ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. `కృతి పేరు మరొకరి మదిలో ఉంది. అతను ఇప్పుడు ముంబైలో లేడు. దీపికాతో షూటింగ్ చేస్తున్నాడు` అంటూ ప్రభాస్ ను ఉద్ధేశిస్తూ మాట్లాడాడు. ఇంకేముంది ప్రభాస్, కృతి స‌న‌న్‌ నిజంగానే ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు ప్రభాస్ మోకాళ్ళపై కూర్చుని కృతి స‌న‌న్‌కు ప్రపోజ్ చేశాడంటూ కూడా ఓ మీడియా సంస్థ రాసుకొచ్చింది.

అయితే ఈ వార్తలు పై తాజాగా కృతి స‌న‌న్ స్పందిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అసలు నిజం ఏంటో ఆమె ఒప్పుకుంది. `ప్ర‌భాస్ తో ప్రేమ కాదు.. పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదు. రియాల్టీ షోలో వరుణ్ ధావ‌న్ కొంచెం హద్దులు దాటి మాట్లాడాడు. సరదాగా చేసిన వ్యాఖ‌లు పుకార్ల‌కు కారణమయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేది వెల్లడించే ముందు నన్ను అసలు విష‌యాన్ని చెప్పనివ్వండి. నెట్టింట వైర‌ల్ అవుతున్న వార్త‌లు రూమ‌ర్స్ మాత్ర‌మే` అంటూ పేర్కొంది. దీంతో ప్ర‌భాస్ తో కృతి ప్రేమ‌, పెళ్లి అంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు చెక్ పడింది.

Share post:

Latest