కృష్ణ చనిపోయే రెండు రోజుల ముందు జరిగింది అదే.. మేకప్ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఈ మధ్యనే మరణించిన విషయం తెలిసిందే . తనదైన స్టైల్ లో నటించి ..అలరించిన కృష్ణ దాదాపు అందరూ హీరోయిన్స్ తోనూ జతకట్టాడు. మరీ ముఖ్యంగా తెరపై కృష్ణ-శ్రీదేవి జంట అంటే జనాలకు అమితమైన ఇష్టం . కాగా డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుని సినిమాల్లో నటించడంలో కృష్ణ తర్వాతే ఎవరైనా అని స్టార్స్ అందరూ చెప్పుకొస్తూ ఉంటారు.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ అనారోగ్య కారణంగా మరణించారు . అయితే ఆయన బ్రతికున్న టైంలో ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ..నవ్వుతూ ..స్నేహపూర్వకంగా మాట్లాడేవారు . మరీ ముఖ్యంగా ఆయన తన కోసం వర్క్ చేసే టెక్నీషియన్స్.. మేకప్ ఆర్టిస్టులతో మాట్లాడే తీరు చాలా పద్ధతిగా ఉంటుంది అంటూ జనాలు చెప్పుకొచ్చేవారు.

కాగా రీసెంట్గా కృష్ణకు మేకప్ మ్యాన్ గా వర్క్ చేసిన మాధవరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరిగ్గా కృష్ణ గారు చనిపోయే రెండు రోజుల ముందు ఆయన తన కలలోకి వచ్చారని ..”దూకవయ్యా దూకవయ్యా ” అంటూ గట్టిగా అరిచారని చెప్పుకొచ్చాడు . అంతే ఉలిక్కి పడి నిద్ర లేచిన నేను ఇది కలగానే ఉండాలని కోరుకున్నారట. అయితే రెండు రోజుల తర్వాత కృష్ణ గారు మరణించారని ..ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు . ప్రస్తుతం కృష్ణ మేకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.