టాలీవుడ్ సినిమాలపై కోలీవుడ్ వార్.. దీనికంత ఆ స్టార్ ప్రొడ్యూసరే కారణం..!!

ఒకవైపు సౌత్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంటే… కోలీవుడ్ లో కొందరు మాత్రం లోకల్ నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలని టాలీవుడ్ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో… కోలీవుడ్లో ఈ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తుంది.. నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు మరియు దర్శకుడు సీమన్ సంచలన కామెంట్లు చేశారు.

Telugu film producers council releases new OTT rules for upcoming films in  Tollywood | Telugu Movie News - Times of India

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న వారసుడు సినిమా.. ఈ సినిమాను దర్శకుడు తమిళ్ నేటివిటీకి తగ్గట్టు తమిళ్లో వారసు పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో డబ్బింగ్ సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంలోనే ఈ రచ్చ జరుగుతుంది.

Thalapathy Vijay's Varisu Trapped In A Five-Way Box Office Clash,  Producer-Distributor Dil Raju In Worry?

దిల్ రాజు ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కావటంతో తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంతో సినిమా విడుదల ఆగిపోతుందని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయకుండా అడ్డుకుంటే.. కోలీవుడ్ లో కూడా తెలుగు సినిమాలు విడుదల చేసే ప్రసక్తే లేదన్నారు. అదే సంక్రాంతికి తెలుగు సినిమాలు కూడా రిలీజ్ లను కూడా తమిళనాడులో అడ్డుకుంటామంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం రెండు ఇండస్ట్రీలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest