నాకు రెండు స్టూడియోలు ఉన్నాయి.. వామ్మో వంట‌ల‌క్క అంత రిచ్చా..?

`స్టార్ మా` లో ప్రసారమయ్యే “కార్తీకదీపం“ సీరియల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సీరియల్ ఐదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయం సాధించింది. అయితే `కార్తీకదీపం` సీరియల్ ఇంత సక్సెస్ కావడానికి కారణం వంటలక్క అలియాస్ దీప పాత్ర. ఈ సీరియల్ లో దీప పాత్ర ప్రాణం పోసింది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇటీవల ఆ పాత్రను తొలగించడం కారణంగా టీఆర్పీ తగ్గిపోయిందని భావించిన మేకర్స్ మళ్లీ కొత్త కథతో ఈ పాత్రను ప్రవేశపెట్టారు. దీన్నిబట్టే అర్థమవుతుంది ఈ పాత్ర ఏ రేంజ్ లో పాపులర్ అయిందనేది.ఇక ఈ పాత్రను పోషించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ పొందింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రేమి విశ్వనాథ్.. తనకు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయని.. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంటాయి అని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అయితే కేవలం తను హైదరాబాద్ కు `కార్తీకదీపం` షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే తాను వస్తానని షూటింగ్ పూర్తి అవ్వగానే అక్కడికి తిరిగి వెళ్ళిపోతానని పేర్కొంది.

తనకు అంత టైం ఉండదు కాబట్టే ఇంటర్వ్యూలలో పాల్గొనదని చెప్పింది. అంతేకాకుండా తను మోడల్ గా కెరీర్ ప్రారంభించిందని.. తాను సీరియల్లో సైలెంట్ గా కనిపించిన బయట మాత్రం చాలా రెబెల్ గా ఉంటానని ఆమె చెప్పకు వచ్చింది. ప్రేమి విశ్వనాథ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వార్త చూసిన కొంతమంది నెటిజనులు వామ్మో వంటలక్క అంత రిచ్చా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest