దేవిశ్రీ ప్ర‌సాద్‌పై పోలీస్ కేసు పెట్టిన క‌రాటే క‌ళ్యాణి.. ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో కేసు నమోదయింది. సినీనటి క‌రాటే కళ్యాణి మరియు పలు హిందూ సంఘాలు దేవిశ్రీ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. దానికి గల కారణం ఏమిటంటే.. ఇటీవల దేవిశ్రీ కంపోజ్ చేసిన `ఓపారి` అనే ఆల్బమ్ సాంగ్ లో `హరే రామ హరే కృష్ణ` మంత్రాన్ని వాడటం. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో `హరే రామ హరే కృష్ణ` మంత్రం ఎలా వాడతారని దేవిశ్రీకి వ్యతిరేకంగాక‌రాటే కళ్యాణి కంప్లైంట్ చేసింది.

ఈ విషయంపై క‌రాటే కళ్యాణి మాట్లాడుతూ..`ఓపారి` అనే ఆల్బమ్ లో “హరే రామ హరే కృష్ణ“ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో ఎలా చిత్రీకరిస్తారని పైగా పవిత్రమైన మంత్రం పై అశ్లీల కరమైన దుస్తులు మరియు నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవి శ్రీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని క‌రాటే కళ్యాణి తో పాటు హిందూ సంఘాలు కూడా దేవిని డిమాండ్ చేశారు.

తక్షణమే ఆ పాటలోని ఆ మంత్రాన్ని తొలగించాలని లేనిపక్షంలో దేవిశ్రీప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని క‌రాటే కళ్యాణి దేవికి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలపై దేవిశ్రీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest