కొత్త కారులో షికారు చేస్తున్న జబర్దస్త్ ఇమ్మానియేల్… అంత సంపాదించాడా?

జబర్దస్త్ ఇమ్మానియేల్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇపుడు బుల్లితెర షోస్ లలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది జబర్దస్త్. అవును, తెలుగు జనాలకు కాస్త మూడ్ ఆఫ్ అయినపుడు ఈ షో పెట్టుకొని చూస్తారు. కాగా ఈ షోలో దూసుకుపోతున్న కామెడియన్లలో ఇమ్మానియేల్ ఒకడు. ప్రస్తుతం ఇమ్మానియేల్ ఆనందంలో మునిగిపోయాడు. దానికి కారణం అతడు తన చిరకాల కల నెరవేర్చుకున్నారు. కారు కొనడం సొంత కారులోనే విహరించాలన్న ఇమ్మానియేల్ కోరిక తాజాగా తీరింది.

అవును, ఇమ్మానియేల్ తాజాగా రెడ్ కలర్ హ్యుందాయ్ కార్ కొనుగోలు చేసాడు. కొత్త కారు కొనడంతోనే షోరూములోనే దాంతో పక్కన నిల్చొని ఫోటోలు తీసుకున్నాడు. ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఇమ్మానియేల్ కి తోడుగా మరో కమెడియన్ రోహిణి జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్మానియేల్ స్పందిస్తూ, నా లైఫ్ లో ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసాడు.

ఇకపోతే ఈ మధ్య జబర్దస్త్ లో ఇమ్మానియేల్ హవా పెరిగిందనే చెప్పుకోవాలి. సీనియర్స్ చాలా మంది షోని వదిలిపోగా ఇమ్మానియేల్ వంటి జూనియర్స్ కి దానిని సావకాశంగా మలుచుకున్నారు. ఇక ఇమ్మానియేల్ ఫేమస్ కావడానికి ముఖ్య కారణం… వర్షతో లవ్ ట్రాక్. అవును, జబర్దస్త్ షోలో రష్మీ-సుడిగాలి మాదిరి వీరిద్దరూ బుల్లితెర లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో వీళ్ళు చేస్తున్న స్కిట్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. దాంతో మనోడు దండిగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు భోగట్టా.ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు షోస్ లో ఇమ్మానియేల్ సందడి చేస్తున్నారు.

Share post:

Latest