బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారని చెప్పవచ్చు. అలాంటి వారిలో జబర్దస్త్ దొరబాబు కూడా ఒకరు. హైపర్ ఆది టీంలో కమెడియన్ గా చేరి కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. దొరబాబు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. దొరబాబు వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దొరబాబు భార్య పేరు అమూల్య రెడ్డి. ఈమె గతంలో టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తూ ఉండేది.కానీ ఇప్పుడు పలు రీల్స్ వీడియోలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఇంస్టాగ్రామ్ రీల్స్ తో నేటిజనులను ఆకట్టుకోవడమే కాకుండా దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్తోంది. టిక్ టాక్ లో ఉన్నప్పుడు లిప్ సింకింగ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన దొరబాబు భార్య అమూల్య ఇప్పుడు అదే సింకింగ్ తో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే పలు షో లలో కూడా కనిపిస్తూ అందర్నీ అలరిస్తూ ఉంటుంది అమూల్య. అమూల్య వివాహం కాకముందు నెల్లూరులో ఒక లోకల్ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కూడా పనిచేసినట్లు సమాచారం.
జబర్దస్త్ కమెడియన్ దొరబాబు పై ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ కూడా 2018లో అమూల్య రెడ్డి దొరబాబును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ప్రస్తుతం ఒక పాప కూడా జన్మించింది. గతంలో వైజాగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్లు దొరబాబు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో తన భర్తకి చాలా సపోర్ట్ గా నిలిచింది అమూల్య. ఆ సంఘటన తర్వాత తన భర్త పై ఎంత ప్రేమ చూపిందంటే దొరబాబు పేరును తన చేతిలో టాటూ కూడా వేయించుకున్నదట. గడచిన కొద్ది రోజుల క్రితం ఢీ షోలో డాన్స్ కూడా వేసి అందరినీ అలరించింది. ప్రస్తుతం దొరబాబు భార్య అమూల్యకు సంబంధించి పలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram