సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు కూడా పబ్లిక్ లో వచ్చారంటే చాలు ఎక్కువగా కూలింగ్ గ్లాసులను ధరిస్తూ ఉంటారు. అయితే కృష్ణ అలా వాటిని ధరించడానికి ఒక కారణం ఉందట. ఈ విషయాన్ని కృష్ణ భార్య విజయనిర్మల గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె తెలియజేసినట్లు తెలుస్తోంది. 1969 లో విజయ నిర్మలని కృష్ణ రెండవ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కృష్ణ ఎక్కడ కనిపించిన అతని వెంట విజయ నిర్మల తరచూ ఉండేది. అందుకు గల కారణాలు కూడా ఆమె తెలియజేసింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కృష్ణ గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయనిర్మల కృష్ణ ని వివాహం చేసుకున్న తర్వాత అతన్ని కాపాడుకోవడానికి చాలా తిప్పలు పడ్డానని తెలియజేసింది. ఎక్కడైనా ఆడవాళ్లు కనిపించారు అంటే కృష్ణకి వెంటనే కూలింగ్ గ్లాసులు వేసేదాన్ని.. అందుకు కారణం ఏమిటంటే ఎవరైనా కృష్ణ ఆడవాళ్లు కళ్ళల్లోకి చూస్తే కృష్ణ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.. వారి కళ్ళల్లోకి సూటిగా చూడలేరు. అందుకే ఇలా కూలింగ్ గ్లాస్ ధరించవలసి ఉంటుందని తెలిపిందట. చెన్నైలో 8 వ అంతస్తులో నిర్మించిన మీసాల కృష్ణుడి దేవాలయంలో ఒక పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో కృష్ణ, విజయనిర్మల బయటికి రావడం జరిగిందట.
ఇక వీరితోపాటు కమెడియన్ రాజబాబు కూడా అక్కడ ఉన్నారట. రాజబాబు చెబుతూ ఈ గుడిలో షూటింగ్ పెళ్లి చేసుకున్న వారంతా నిజంగానే వివాహం చేసుకున్నారని ఇది చాలా పవర్ఫుల్ గుడి అని తెలియజేశారట రాజబాబు. చివరికి తమ విషయంలో కూడా అదే జోష్యం నిజమైందని విజయనిర్మల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కృష్ణ కూలింగ్ గ్లాస్ ధరించడానికి కారణం ఇదే. ఇక 2019 జూన్ నెలలో విజయనిర్మల మరణించగా.. ఇక ఈనెల 15వ తేదీన కృష్ణ తుది శ్వాస విడుచడం జరిగింది.