ప్రభాస్ కవరింగ్ అందుకేనా? రెబల్ ఫాన్స్ ఇక తట్టుకోగలరా?

ఈమధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎక్కడ చూసినా తలపైన ఓ గుడ్డతో కనబడుతున్నారు. షూటింగ్ స్పాట్ తప్పించి బయటకి ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చినా ఇదే గెటప్ లో వెళ్తుండటం మనం గమనించవచ్చు. అయితే ఇదే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని ఫినిష్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్‌`, నాగ అశ్విన్ డైరెక్షన్ లో `ప్రాజెక్ట్ కె` చిత్రాలను ఏకధాటిలో పూర్తి చేసే పనిలో పడ్డాడు.

ఇక ఈ సినిమాలు పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. అలాగే వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ప్ర‌భాస్‌ ఓ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్ లుక్ పైనే ప్రస్తుతం అంతా చర్చ. అతని లుక్ పైన గత కొంతకాలం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తూ భారీ అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్.. ఈ మధ్య కాలంలో అసలు అందమే లేకుండా తయారయ్యాడు.

ఆయన ముఖంలో మునుపటి కల ఏమాత్రం కనిపించడం లేదని ఓ పక్క రెబల్ అభిమానులు సైతం డిప్రెషన్ కి లోనవుతున్నారు. దానికి తోడు రోజుల నుంచి ఎక్కడకు వెళ్లిన తన హెయిర్ ను కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడం పై గట్టిగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కు నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే హెయిర్ కనిపించకుండా క్యాప్ తో కవర్ చేసుకున్నాడు. దీంతో నెటిజ‌న్లు మరియు యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్‌కు బట్టతల వచ్చేసిందా..? అందుకే ఇలా క్యాప్ తో కవర్ చేస్తున్నాడా..? అంటూ సోషల్ మీడియా ద్వారా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest