తెలుగు ప్రేక్ష‌కుల‌కు ర‌ష్మిక గుడ్ బై.. తీవ్ర అందోళ‌నలో ఫ్యాన్స్‌!?

నేషనల్ క్రషర్ రష్మిక మందన్నా తెలుగు ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుందని, ఆమె తెలుగు సినిమాల్లో కనిపించదని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది.

ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట‌. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 4 కోట్లు నుంచి 5 కోట్ల వ‌ర‌కు ఈ అమ్మడు డిమాండ్ చేస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాతలు రష్మి కను సంప్రదించేందుకే వెనకడుగు వేస్తున్నారట. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వారిని పక్కన పెట్టడం పొరపాటుగా వస్తోంది.

ఇప్పుడు రష్మిక విషయంలోనూ అదే జరుగుతుందని టాక్‌ నడుస్తోంది. పైగా రష్మిక చేతిలో పుష్ప 2 సినిమా మినహా మరో తెలుగు ప్రాజెక్ట్ లేదు. కానీ, బాలీవుడ్ లో మాత్రం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ ప్ర‌చారం ప‌ట్ల ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

Share post:

Latest