సంచ‌ల‌నం.. విడాకులు ర‌ద్దు దిశ‌గా చై-సామ్‌.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ‌ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవకముందే విడాకుల వైపు ట‌ర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు.

అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. చై-సామ్ లు విడాకులను రద్దు చేసుకోబోతున్నారట. గత కొద్ది రోజుల నుంచి సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యాన్ని చెప్పారు. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. అయితే అటు నాగ చైతన్యగానీ, ఇటు నాగార్జున‌గానీ.. సమంత ఆరోగ్యం పై ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఎక్కడ నోరు విప్పలేదు.

కానీ సమంత అనారోగ్యానికి గురైనప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎంతో సపోర్ట్ గా నిలిచిందట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోయినా.. పర్సనల్‌గా ఆమెను దగ్గరుండి చూసుకున్నారట. ఈ నేపథ్యంలోనే స‌మంత మనసు మార్చుకుని విడాకులు వెనక్కి తీసుకోవాలని భావిస్తుందట. నాగచైతన్య కూడా సామ్ తో మళ్ళీ క‌లిసిపోవాల‌ని డిసైడ్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే చై-సామ్‌ విడాకులు రద్దు దిశ‌గా వెళ్ల‌బోతున్నార‌ని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest