ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారేనా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు మరచిపోలేని పాత్రలలో మెప్పించిన నటులలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ముఖ్యంగా మల్టీ స్టార్ ట్రెండు ని సెట్ చేశారు కృష్ణ. తనకు సోలో హీరోగా ఎంతటి క్రేజీ వచ్చినా సరే తను సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ,ఏఎన్నార్లతో కలిసి నటించారు. అంతేకాకుండా తనతో సమానంగా ఉన్న నటులలో శోభన్ బాబు, కృష్ణంరాజు తో కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు.ఇప్పటివరకు తెలుగులో 350 కు పైగా సినిమాలలో నటించారు కృష్ణ. అయితే ఎన్టీఆర్ తరువాత కృష్ణ అ ఆస్థానంలో ఉన్నారని చెప్పవచ్చు.

When NTR Obliged Super Star! | cinejosh.com

ఎన్టీఆర్, కృష్ణ సినిమాలలో ఎంట్రీ ఇచ్చే సమయంలో ఎన్టీఆర్ ఒక పెద్ద హీరో కానీ తనకు సినిమాలలో నటించాలని ఉందని ఎన్టీఆర్ కోసం మద్రాస్ కు వెళ్లి కలిశారట కృష్ణ. ఆ సమయంలో నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి మరో మూడేళ్ల తర్వాత రమ్మని ఎన్టీఆర్ చెప్పారట. ఆ తర్వాతే తేనె మనసులు చిత్రంలో అవకాశం రావడం జరిగిందట. అప్పటినుంచి కృష్ణ వరుసగా సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. ఇక ఎన్టీఆర్ తో కృష్ణ దాదాపుగా ఐదు సినిమాలు చేశారు అందులో కృష్ణ నిర్మించిన దేవుడు చేసిన మనుషులు చిత్రం కూడా ఉంది.

ఎన్టీఆర్, కృష్ణ నటించిన మొదటి చిత్రం శ్రీ జన్మ. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముడు పాత్రల
లో కృష్ణ నటించారు. ఆ తర్వాత నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం వంటి సినిమాలలో ఎన్టీఆర్ తో కలిసి కృష్ణ స్క్రీన్ ని షేర్ చేసుకోవడం జరిగిందట.తనకు స్టార్ ఇమేజ్ వచ్చాక ఎన్టీఆర్ తో కలిసి నటిస్తూ సినిమా నిర్మించారు కృష్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి ఈక్వల్ గా కృష్ణా నటించారు. ఇక ఎక్కువ సినిమాలు చేసిన వారిలో ఎన్టీఆర్ తర్వాత కృష్ణ అనే ఉన్నారని చెప్పవచ్చు.

Share post:

Latest