నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. సరిగ్గా పనిచేయని నాయకులకు సీటు ఇవ్వనని చెప్పేశారు..అలాగే టీడీపీ-జనసేన పొత్తు సెట్ అయితే, పొత్తు బట్టి కూడా సీట్లు మార్చే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట సీటుపై కూడా కన్ఫ్యూజన్ ఉంది.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు..ఈయన పనితీరు అంతంత మాత్రమే. మొదట్లో ప్రజల్లో ఎక్కువ తిరగలేదు..కానీ తర్వాత వైసీపీ అధిష్టానం క్లాస్ ఇచ్చాక చంటిబాబు రూట్ మార్చి, కాస్త ప్రజల్లో ఉంటున్నారు. అయినా సరే చంటిబాబుకు ఇక్కడ అంత పాజిటివ్ కనిపించడం లేదు. పైగా అటు అపోజిట్‌లో టిడిపి సీనియర్ జ్యోతుల నెహ్రూ బలం పెరుగుతుంది. ఆయన తనయుడు నవీన్ పాదయాత్ర ద్వారా జగ్గంపేట ప్రజల్లో ఉంటున్నారు. ఇక జనసేనతో గాని పొత్తు ఫిక్స్ అయితే నెహ్రూకు అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇలాంటి పరిస్తితుల్లో జగ్గంపేట సీటుపై వైసీపీలో కన్ఫ్యూజన్ ఉంది..మళ్ళీ సిహన్త చంటిబాబుకు సీటు ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. పైగా ఈ సీటు కోసం మాజీ ఎంపీ తోట నరసింహం, ముద్రగడ పద్మనాభం సైతం తన కుమారుడికి ఈ సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అటు గణేశుల రాంబాబు సైతం ఇదే సీటుపై కన్నేశారు. ఇలా వైసీపీలో జగ్గంపేట సీటు కోసం పోటీ పెరిగింది.
మరి వీరిలో జగన్ ఎవరికి సీటు ఇస్తారనేది తెలియడం లేదు. సిట్టింగ్‌ని కాదని సీటు వేరే వారికి ఇచ్చే సాహసం చేస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎన్నికల నాటికి ఎమ్మెల్యేకు పాజిటివ్ లేకపోతే ఖచ్చితంగా వేరే నేతని దింపేస్తారు. ఇక జనసేనతో పొత్తు ఉన్నా సరే ఈ సీటు టిడిపి నుంచి జ్యోతుల పోటీ చేయడం దాదాపు ఖాయమే.