బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన డాక్టర్ జి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఆశించినంత హిట్‌ను అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన నార్త్ వర్సెస్ సౌత్ సినిమాల సినిమాలకు సంబంధించిన డిబెట్‏లో ఈ ముద్దుగుమ్మ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె మాట్లాడుతూ..’ సినిమా అనేది భావోద్వేగాలకు సంబంధించినది. దీనికి భాషతో సంబంధం లేదు. నార్త్ వర్సెస్ సౌత్ అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది.. కానీ ఆలనాటి సీనియర్ హీరోయిన్ శ్రీదేవి- టబు వంటి స్టార్ హీరోయిన్లు నార్త్ లోను సౌత్ లోనూ నటించారు. అప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు అన్ని భాషల్లోనూ రీమేక్ అయి వస్తూనే ఉన్నాయి’.

‘ఇప్పుడు వారు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కరోనా తర్వాత నుండి సినిమా పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. విజయం సాధించడంలో చిత్ర కంటెంట్ గురించి అన్ని భాషల్లో పెద్ద చర్చ జరుగుతుంది’. ‘ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీని వెనక చాలా శ్రమనే ఉంటుందని ఆమె చెప్పింది’. ‘అలాగే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒక దశ మాత్రమే అని… అభిమానులు డిజాస్టర్ సినిమాలు గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కానీ సినిమా తెరకెక్కించేందుకు చాలా కృషి అవసరం.. ప్రస్తుతం సౌత్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది’.

‘కరోనా తర్వాత అభిమానుల అభిరుచులు చాలా వరకు మారిపోయాయి.. సౌత్.. నార్త్ సినిమాల అని చూడడం లేదు వారికి ఏ సినిమా నచ్చితే ఆ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. సినిమాకి బాష‌తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో విజయం అందిస్తున్నారు. దీనికి ఉదాహరణ తాజాగా వచ్చిన కాంతారా సినిమా’. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరిసారిగా కొండపొలం సినిమాలో నటించింది. తర్వాత బాలీవుడ్ లో థాండ్ గాడ్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె నటించిన ఛత్రివాలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.