విడాకుల‌కు సిద్ధ‌మైన నిఖిల్‌.. ఓపెన్‌గా తేల్చేసిన హీరో!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకులు చాలా కామన్ గా మారాయి. ఇప్పటికే ఎందరో నటీనటులు విడాకులు తీసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్.. రీసెంట్‌గా `కార్తికేయ 2` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రెజ్‌ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2020లో ఈ యంగ్ హీరో బ్యాచిలర్ లైఫ్ తో ఎండ్ కార్డ్ వేసి మే 14న భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో నిఖిల్ వివాహం అంగరంగ వైభవంగ‌ జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత లేదని.. నిఖిల్ పల్లవి విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ జోరుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు ప‌ల్ల‌వి నిఖిల్ దూరంగా ఉంటున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే నిఖిల్ అసలు నిజం ఏంటి అన్నది ఓపెన్ గా తేల్చేశాడు. తాజాగా భార్య పల్లవి తో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన నిఖిల్.. నువ్వు పక్కన ఉన్న ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ పేర్కొన్నాడు. ఈ ఒక్క ఫోటోతో నిఖిల్ విడాకుల వార్తలు పుకార్లే అని తేలిపోయింది.

Share post:

Latest