విష్ణు విశాల్.. తాజాగా రవితేజ నిర్మాణ సారధ్యంలో తెలుగు తమిళ్ భాషలలో తెరకెక్కిస్తున్న చిత్రం మట్టి కుస్తీ.. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని.. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఈగో వంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుందని విష్ణు విశాల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ అని.. సంసారంలో వచ్చే సమస్యలు భార్యాభర్త మధ్య జరిగే సహజమైన విషయాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.. నిజానికి ఈ కథ విన్నప్పుడే తెలుగులో కూడా చేయాలని నిర్ణయించుకున్న విష్ణు విశాల్ ఇదే విషయాన్ని రవితేజతో కూడా స్పష్టం చేశారట. అయితే ఏ జంట కైనా.. ఏ భార్యాభర్తల మధ్యనైనా సమస్యలు వస్తాయని.. ఇగోలు ఉంటాయని చెప్పిన విష్ణు విశాల్ తన మొదటి పెళ్లి , విడాకుల గురించి కూడా స్పందించాడు.
విష్ణు విశాల్ మాట్లాడుతూ..” నా మొదటి పెళ్లి విడాకులతో ముగిసింది.. అప్పుడు కొన్ని తప్పులు జరిగాయి.. నేను ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానో లేక ఆమె నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయిందో.. ఆమె ఆశించింది నేను చేయలేకపోయానో.. నా ఒత్తిడి ,నా కోపం అనవసరంగా ఆమె మీద చూపించానో ఏమో తెలియదు కానీ ఇలా చాలా తప్పులు జరిగిపోయాయి . ఇప్పుడు చాలా నేర్చుకున్నాను అంటూ మొదటి పెళ్లి , విడాకుల మీద స్పందించాడు విష్ణు విశాల్..అయితే అదే సమయంలో గుత్తా జ్వాల మాత్రం తనను అర్థం చేసుకుందని.. సినిమాల విడుదల సమయంలో తాను ఎలా ఉంటానో దగ్గరుండి చూస్తోందని కూడా చెప్పుకొచ్చాడు.
అంతేకాదు సినిమాల మీద చెప్పే అభిప్రాయాలు గుత్తా జ్వాలవి చాలా కచ్చితంగా ఉంటాయని, మొదట్లో ఆమె ఊరికే చెబుతుందని అనుకున్నాను. కానీ ఆమె మాటలు చెప్పినట్టుగానే రిజల్ట్ వచ్చేది.. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు సినిమాలు చూస్తూనే ఉంటుంది.. ఆమె చెప్పినట్టుగానే సినిమా రిసల్ట్ కూడా వస్తుంది.. ఈ మట్టి కుస్తీ సినిమా కూడా షూర్ షాట్ హిట్ అవుతుందని కూడా రివ్యూ ఇచ్చేసింది” అంటూ గుత్తా జ్వాల అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు విష్ణు విశాల్.