8 ఏళ్లుగా హిట్ లేదు.. అయినాస‌రే గోపీచంద్ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తున్నాడా?

టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాలు చేసిన గోపీచంద్.. మళ్లీ హీరోగా మారాడు. యజ్ఞం, ఆంధ్రుడు, రణం తదితర చిత్రాలతో మాస్ హీరోగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

అయితే గత కొన్ని ఏళ్ల నుంచి గోపీచంద్ కెరీర్ అంత సజావుగా సాగడం లేదు. ఈయన ఖాతాలో సరైన హిట్టు పడి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. అప్పుడెప్పుడో 2014లో విడుదలైన `లౌక్యం` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ నటించిన సినిమాలన్నీ అంతంత మాత్రం గానే ఉన్నాయి.

 

అయితే సరైన హిట్ లేకపోయినా గోపీచంద్ హై రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట‌. ఈయ‌న‌ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 6 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్‌ చేస్తున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు.. గోపీచంద్ కు సరైన హిట్ లేకపోయినా ఆయన సినిమాలకు నాన్ థియేట్రిక‌ల్‌ బిజినెస్ భారీగా జరుగుతుంటుంది. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కున్న మార్కెట్ దృష్ట్యా గోపీచంద్ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడ‌నే టాక్ ఉంది.

Share post:

Latest